రష్యాపై అమెరికా కంపెనీల కన్నెర్ర ! ఇకపై నో బిజినెస్‌

Starbucks Coke Pepsi And Many Companies halt sales in Russia - Sakshi

Us Companies Banning Russia: శీతల పానియాల సంస్థలు పెప్సికో, కోకకోలాలను రష్యాలో తమ కార్యకలాపాలు, వ్యాపారాల లావాదేవీలను నిలపివేస్తున్నట్టు ప్రకటించాయి. వ్యాపార రంగంలో బద్ధ శత్రువులుగా ఉన్న ఈ రెండు కంపెనీలు రష్యాపై ఆంక్షల విషయంలో ఒకే బాణి వినిపించాయి. ఇదే బాటలో మరిన్ని కంపెనీలు ఉన్నాయి.

- ప్రముఖ రెస్టారెంట్‌ సంస్థ మెక్‌ డోనాల్డ్‌ రష్యాలో బిజినెస్‌కి ఫులిస్టాప్‌ పెట్టింది. 1990లో తొలిసారిగా మాస్కో నగరంలో మెక్‌ డోనాల్డ్‌ రెస్టారెంట్‌ ప్రారంభమయ్యింది. ప్రస్తుతం మెక్‌ డోనాల్డ్‌కి సంబంధించి రష్యాలో 62 వేల మంది పని చేస్తున్నారు. ప్రస్తుతం వీరి భవిష్యత్తు సందిగ్దంలో పడింది.
- కోకకోలా, పెప్సికో సంస్థలు రష్యాలో వ్యాపారం ఆపేస్తున్నట్టు ప్రకటించాయి. శీతల పానీయాలు అమ్మబోమని కానీ పాలు, ఇతర ఆహార పదార్థాల అమ్మకం జరుపుతామంటూ పెప్సీ ప్రకటించింది. ఇక 1980లో మాస్కోలో జరిగిన ఒలంపిక్స్‌కి స్పాన్సర్‌గా వ్యవహరించిన కోకకోలా సైతం రష్యాపై గుర్రుగా ఉంది.
- అమెజాన్‌ సంస్థ సైతం క్లౌడ్‌ కంప్యూటింగ్‌కి సంబంధించి రష్యా నుంచి ఆర్డర్లు తీసుకోబోమని తెగేసి చెప్పింది.
- స్టార్‌బక్స్‌ సంస్థ రష్యాలో తమ వ్యాపార లావాదేవీలు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించింది.
- యూనివర్సల్‌ మ్యూజిక్‌ రష్యాలో తమ ఆపరేషన్స్‌ సస్పెండ్‌ చేసింది
- ఆన్లైన్‌ డేటింగ్‌ యాప్‌ బంబిల్‌ రష్యా, బెలారస్‌లలో తమ యాప్‌లను తొలగించింది
- రాయల్‌ డచ్‌, షెల్‌ కంపెనీలు రష్యా నుంచి ఆయిల్‌ను కొనుగోలు చేయమని తేల్చి చెప్పాయి

చదవండి: అమెరికా, రష్యా ఆధిపత్య పోరు.. చుక్కలను తాకుతున్న ముడి చమురు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top