మార్కెట్ల దూకుడు : 560 పాయింట్లు జంప్

భారీ లాభాలు, 49వేల ఎగువకు సెన్సెక్స్
14400 ఎగువకు నిఫ్టీ
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో జోరుగా కొనసాగుతున్నాయి. గత రెండురోజులుగా వరుసగా నష్టపోయిన కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలకుఎగువన స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 0.7శాతం లాభంతో 48900 వద్ద సెన్సెక్స్, 0.63శాతం లాభంతో 14371 వద్ద నిఫ్టీలు ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అనంతరం మరింత ఎగిసి సెన్సెక్స్ 567 పాయింట్లు జంప్ చేసి 49132 వద్ద, నిఫ్టీ 167 పాయింట్లు ఎగిసి 14448 వద్ద కొనసాగుతున్నాయి. వద్ద ఉత్సాహంగా ఉన్నాయి. దాదాపుఅన్ని రంగాలు షేర్లులాభాలతో కళ కళలాడుతున్నాయి. ప్రధానంగా మెటల్స్ మీడియా, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ మార్కెట్లను లీడ్ చేస్తున్నాయి.
టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌గా ఉన్నాయి. గ్రాసీం ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, సిప్లా. రిలయన్స్, ఎస్‌బీఐ టాప్ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ,ఐటీసీ, యూపీఎల్, ఎంఅండ్‌ఎం , హెచ్‌యూఎల్ నష్టంతో ఉన్నాయి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి