స్టాక్ మార్కెట్లను వణికిస్తున్న ఒమిక్రాన్!

Sensex Crashes Over 900 Points, Nifty Ends Below 17000 On Omicron Fears - Sakshi

ముంబై: ఒమిక్రాన్‌ వేరియెంట్‌ భయాల నేపథ్యంలో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. ఒమిక్రాన్‌ వేరియెంట్‌ భయాలతో ఆసియా, అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో కొనసాగడం, మార్కెట్లోని దిగ్గజ కంపెనీలు అనుకున్న స్థాయిలో పుంజుకోకపోవడంతో స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసింది. చివరకు, సెన్సెక్స్ 949.32 పాయింట్ల(1.65%) నష్టంతో 56,747.14 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 284.45 పాయింట్లు(1.65%) క్షీణించి 16,912.25 దగ్గర స్థిరపడింది. 

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.42 వద్ద ఉంది. యుపీఎల్ మినహా సెన్సెక్స్‌ 30 షేర్లలో ఏ ఒక్కటీ లాభపడలేదు. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ, మారుతీ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. ఐటీ రంగాలలో ఇండెక్స్ 2 శాతం, ఇతర రంగాలు ఒక్కొక్కటి 1 శాతం కోల్పోయాయి. 

(చదవండి: కొత్త కారు కొనే వారికి బంపర్ ఆఫర్.. భారీగా తగ్గింపు!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top