ఓలా ఎలక్ట్రిక్ : 2 వేల ఉద్యోగాలు

Ola Electric begins restructuring to hire 2000 people - Sakshi

త్వరలోనే ఓలా తొలి ఇ-స్కూటర్ లాంచ్

ప్రపంచవ్యాప్తంగా 2 వేల ఉద్యోగావకాలు

సాక్షి,ముంబై: ఓలా క్యాబ్స్ కు చెందిన సంస్థ విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీలో ముందడుగు వేస్తోంది.  ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్  తొలి ఉత్పత్తిని త్వరలో విడుదల చేయడానికి తమ బృందం కృషి చేస్తోందని ఓలా క్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు , సీఈఓ  భవీష్ అగర్వాల్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా  భారీ నియామకాలను చేపట్టనున్నట్టు వెల్లడించారు.   (చదవండి : 2021 నాటికి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్)

భారీ ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ లక్ష్య సాధనలో భాగంగానే రాబోయే 3 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 1,000 మంది ఇంజనీర్లను నియమించుకుంటామని, ఇతర పాత్రలలో మరో 1,000 మందిని ఎంపిక చేయనున్నామని మంగళవారం  ఉద్యోగులకు ఇచ్చిన అంతర్గత ఇమెయిల్‌లో సమాచారంలో అగర్వాల్  తెలిపారు. గ్లోబల్ మార్కెట్ ,  అన్ని విభాగాలలో ఎలక్ట్రిక్ వానాలు,  బాస్ వ్యవస్థలను నిర్మించడం లక్ష్యమనీ, ఇందుకోసంత్వరలో అనేక కొత్త కార్యక్రమాలను ప్రారంభించబోతున్నామన్నారు. ఓలా ఎలక్ట్రిక్‌ను గ్లోబల్ ఇంజనీరింగ్ సంస్థగా మార్చే లక్ష్యంతో సంస్థాగత పునర్నిర్మాణాన్ని ప్రారంభిస్తామని అగర్వాల్  పేర్కొన్నారు. కాగా ఈ ఏ డాది మే నెలలో అమెస్టర్‌డామ్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టప్ కంపెనీ ఎటెర్గో బీవీను ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ (ఓఈఎం) కొనుగోలు చేసింది.  తద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్లలో వినియోగించే అధిక శక్తి సాంద్రత కలిగిన బ్యాటరీ టెక్నాలజీకి ఓలా ఎలక్ట్రిక్  సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top