వేధించకండి! రుణ రికవరీ ఏజెంట్లపై ఆర్‌బీఐ ఉక్కుపాదం!

Not Intimidate Borrowers RBI Directs Loan Recovery Agents  - Sakshi

రుణ రికవరీ ఏజెంట్లపై ఆర్‌బీఐ ఉక్కుపాదం!

ముంబై: రుణ వసూళ్ల ఏజెంట్లు అనైతిక విధానాలకు పాల్పడకుండా ఆర్‌బీఐ కఠిన ఆదేశాలు జారీ చేసింది. రుణాలు చెల్లించాలంటూ రుణ గ్రహీతలను బెదిరించడాన్ని నిషేధించింది. అలాగే, రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య రుణం కోసం కాల్‌ చేయడం కూడా కుదరని స్పష్టం చేసింది. తన నియంత్రణలోని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు (ఆర్‌ఈలు), ఏఆర్‌సీలకు సంబంధించి అదనపు మార్గదర్శకాలను ఆర్‌బీఐ శుక్రవారం విడుదల చేసింది.

(Maruti Suzuki Swift S-CNG వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్‌ అనాల్సిందే!)

రుణాలను వసూలు చేసే ఏజెంట్లు భౌతికంగా లేదా మాటల రూపంలో వేధింపులకు పాల్పడకుండా ఆర్‌ఈలు చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐ కోరింది. ఏ రూపంలోనూ అనుచిత సందేశాలు పంపకూడదని, గుర్తు తెలియని కాల్స్‌ రూపంలో వేధించకూడదని స్పష్టం చేసింది. రికవరీ ఏజెంట్లు ఇటీవలి కాలంలో ఆమోదనీయం కాని చర్యలకు పాల్పడుతున్నట్టు తెలియడంతో ఆర్‌బీఐ ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది.    

చదవండి: వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌పై నిషేధం, వెబ్‌సైట్‌, డౌన్‌లోడ్‌ లింక్‌ బ్లాక్‌

Election 2024

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top