లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్స్‌..!

MARKETS: Sensex Nifty Turn Volatile Realty Auto Stocks Gain IT Weakens - Sakshi

రష్యా-ఉక్రెయిన్‌ వివాదం కాస్త సడలించడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం రోజున (ఫిబ్రవరి 15) న భారీ లాభాలతో ముగిశాయి. బుధవారం కూడా అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ లాభాల్లో దూసుకుపోతున్నాయి దేశీయ సూచీలు.బీఎస్సీ సెన్సెక్స్‌ ఉదయం 9.33 సమయంలో 225 పాయింట్ల లాభంతో 58,367.49 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 42 పాయింట్లు లాభపడి 17,391.55 ట్రేడవుతోంది. 

సెన్సెక్స్-30 షేర్లలో ఎం అండ్ ఎం, మారుతీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డిఎఫ్‌సి, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సిఎల్ టెక్, కోటక్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, నెస్లే, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ 0.7-1.6 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, టాటా స్టీల్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. విస్తృత మార్కెట్లలో బీఎస్సీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా సానుకూలంగా ఉన్నాయి. 

చదవండి: చైర్మన్, ఎండీ బాధ్యతల విభజన స్వచ్ఛందమే!

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top