సెంచరీతో షురూ- ఆటో, రియల్టీ అప్

Market up- Auto, Realty gains - Sakshi

120 పాయింట్లు అప్‌-40,460కు సెన్సెక్స్‌ 

39 పాయింట్ల లాభంతో 12,159 వద్దకు నిఫ్టీ

ప్రభుత్వ బ్యాంక్స్, ఆటో, మీడియా ప్లస్

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం అప్‌

ముంబై: అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్ష నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 120 పాయింట్లు పుంజుకుని 40,460కు చేరగా.. నిఫ్టీ 39 పాయింట్లు బలపడి 12,159 వద్ద ట్రేడవుతోంది. ఫెడరల్ యథాతథ పాలసీ అమలు, డెమొక్రాట్‌ అభ్యర్థి జోబిడెన్‌ విజయంపై అంచనాలతో గురువారం యూఎస్‌ మార్కెట్లు 2 శాతం స్థాయిలో ఎగశాయి. కాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 41,539 వద్ద గరిష్టాన్ని తాకగా.. 41,383 వద్ద కనిష్టం నమోదైంది. నిఫ్టీ 12,173- 12,132 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.

ఐటీ వీక్
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ప్రభుత్వ బ్యాంకులు, ఆటో, మీడియా, రియల్టీ 1.2-0.7 శాతం మధ్య లాభపడగా..   ఐటీ 0.2 శాతం డీలా పడింది. నిఫ్టీ దిగ్గజాలలో రిలయన్స్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, ఐషర్, ఎస్బీఐ, హీరో మోటో, ఐవోసీ, హెచ్డీఎఫ్సీ, ఎంఅండ్ఎం 3-1 శాతం మధ్య పెరిగాయి. అయితే టెక్‌ మహీంద్రా, కొటక్ బ్యాంక్, గెయిల్, నెస్లే, పవర్ గ్రిడ్, యాక్సిస్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్‌ 1.5-0.5 శాతం మధ్య నీరసించాయి. 

డెరివేటివ్స్‌లో
డెరివేటివ్స్‌లో గోద్రెజ్ ప్రాపర్టీస్, ఐబీ హౌసింగ్, అపోలో టైర్, బెర్జర్ పెయింట్స్, పెట్రోనెట్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఇన్ఫ్రాటెల్, ఎస్కార్ట్స్, ఎస్ఆర్ఎఫ్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ 4-2 శాతం మధ్య వృద్ధి చూపాయి. కాగా.. మరోపక్క కంకార్, టొరంట్ పవర్, మైండ్ ట్రీ, చోళమండలం, శ్రీరామ్ ట్రాన్స్, బీఈఎల్ 7.2-1 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1084 లాభపడగా.. 466 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top