ఈసీఎల్జీఎస్ గడువు పెంచిన కేంద్రం

Govt Extends ECLG Scheme By Another Three Months - Sakshi

వ్యాపారం కోసం రుణాలు తీసుకోవాలనుకునే వారికి శుభవార్త. కరోనా మహమ్మరి కారణంగా దెబ్బతిన్న వ్యాపారాలు తిరిగి పుంజుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్(ఈసీఎల్జీఎస్ 
1.0, 2.0,)ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకువడానికి గడువు 2021 మార్చి 31వరకు ఉండేది. ఇప్పుడు ఆ గడువు ముగియడంతో మరోసారి గడువు తేదీని 2021 జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, ఈసీఎల్జీఎస్ 3.0 కూడా తీసుకోని వచ్చింది.

ఈసీఎల్జీఎస్ 3.0 కింద ఆరోగ్యం, ప్రయాణం & పర్యాటక, లీజర్ అండ్ స్పోర్టింగ్ రంగాల్లో వ్యాపారాలు చేస్తున్నవారికి కూడా ఈ పథకాన్ని అమలుచేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక విండోనో ఓపెన్ చేసింది. ఈసీఎల్జీఎస్ 3.0 కింద మంజూరు చేసిన రుణాల వ్యవధి 2 సంవత్సరాలు. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్స్‌ దరఖాస్తు గడువును 2021 జూన్ 30 వరకు పొడిగించింది. అర్హుల గల వ్యాపారాలు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద రూ.3,00,000 కోట్లు రుణాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఒకవేళ గడువులోగా లక్ష్యాన్ని చేరుకుంటే అప్లికేషన్ విండో క్లోజ్ అవుతుంది. 

చదవండి:

రిలయన్స్‌-ఫ్యూచర్‌ గ్రూప్‌ డీల్‌ గడువు పొడగింపు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top