Elon Musk: ఎలన్‌ మస్క్‌ నోట...సూపర్‌స్టార్‌ మహేశ్‌ మాట..! ఏమన్నాడంటే..?

Elon Musk Reminds His Speech Of Superstar Mahesh Movie Srimanthudu Dialogues - Sakshi

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాను అందరూ చూసే ఉంటారు. అప్పట్లో ఈ సినిమా ఘనవిజయాన్నే సాధించింది. సినిమాలోని డైలాగ్స్‌తో పాటు ప్రతి అంశం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.  అంతేకాక శ్రీమంతుడు మూవీ రాకతో గ్రామాలను తీసుకునే ట్రెండ్‌ వచ్చేసింది. ఎంతోమంది గ్రామాలను దత్తత తీసుకునేందుకు ముందుకువచ్చారు.  కాగా తాజాగా శ్రీమంతుడు సినిమాలోని మహేశ్‌ బాబు డైలాగ్స్‌ను గుర్తుచేస్తూ టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కొత్త ఏడాది సందర్భంగా ఎలన్‌ మస్క్‌ యువకులకు సందేశమిచ్చారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రీసెర్చర్‌ లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వూలో పలు సలహాలను విద్యార్థులకు ఇచ్చారు. ఎలన్‌ మస్క్‌...ఒక మాట మాట్లాడుతూ... సాటి మానవులకు పనికొచ్చే పనులు మాత్రమే మనం చేస్తే బాగుంటుందని అన్నారు. మనం సమాజం నుంచి ఎంత లబ్ధి పొందుతున్నామో.. అంతకంటే ఎక్కువ తిరిగివ్వాలని సూచించారు.

మస్క్‌ మాటలు సేమ్‌ శ్రీమంతుడు సినిమాలోని మహేష్‌ డైలాగ్‌..‘ తిరిగిచ్చేయాలి లేకపోతే లావై పొతాం...’ గుర్తుచేశాయి.  ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని విద్యార్థులకు మస్క్‌ హితవు పలికారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్నమైన వ్యక్తులతో మాట్లాడినప్పుడే మనం మరింత స్వేచ్ఛగా ఆలోచించగలుగుతామని చెప్పారు. 

చదవండి: ఎలన్‌ మస్క్‌ సంపాదనకు రూ.83 వేల కోట్ల పన్ను కూడా తక్కువే!: ప్రమీలా జయపాల్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top