Donald Trump:తగ్గేదే లే....! ప్రతీకారానికి సిద్ధమైన డోనాల్డ్‌ ట్రంప్‌.. వచ్చే నెలలో..

Donald Trump To Launch His Social Media App In February - Sakshi

అమెరికా క్యాపిటల్‌ హిల్‌ హింసాత్మక ఘటనల నేపథ్యంలో యూఎస్‌ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను నిషేధిస్తూ పలు సోషల్‌ మీడియా సంస్థలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సొంత ప్లాట్‌ఫాంకు ట్రంప్‌ వడివడిగా అడుగులు వేస్తూ ట్రూత్‌ అనే సోషల్‌ మీడియా ప్లాట్‌పాంను త్వరలోనే లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.   

ఫిబ్రవరిలో లాంచ్‌..!
సోషల్‌మీడియా దిగ్గజాలపై అక్కసును తెలియజేస్తూ సొంత సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌ను డోనాల్డ్‌ ట్రంప్‌ ఫిబ్రవరి 21న లాంచ్‌ చేయనున్నారు. ట్విటర్‌కు ప్రత్యామ్నాయంగా ట్రూత్‌ యాప్‌ను ట్రంప్‌  ఆవిష్కరించనున్నాడు. యూఎస్‌ ప్రెసిడెంట్‌ డే సందర్భంగా ట్రూత్‌ యాప్‌ను లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ట్రూత్‌ డెమో ఫోటోల ప్రకారం ట్విటర్‌ మాదిరిగానే ఈ యాప్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. ట్రెండింగ్‌ టాపిక్స్‌, ట్యాగింగ్‌ వంటి ఆప్షన్స్‌తో రానుంది. ఇప్పటికే ట్రూత్‌కు సంబంధించిన వివరాలను ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌(టీఎంటీజీ) యాపిల్‌ ఇంక్‌ యాప్‌ స్టోర్‌ లిస్టింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది.  


 

సబ్‌స్క్రిప్షన్‌ బేస్డ్‌ సేవలు..!
టీఎంటీజీ ప్రకారం ట్రూత్‌ పలు సేవలను యూజర్లకు అందించనుంది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం...ఎంటర్‌టైన్‌మెంట్‌ , న్యూస్‌, పాడ్‌కాస్ట్‌ సేవలను యూజర్లకు అందుబాటులో ఉంటాయి. ఇది కేవలం TMTG+ అనే సబ్‌స్క్రిప్షన్ బేస్డ్‌ వీడియో-ఆన్-డిమాండ్ సేవ. 

చదవండి: చైనా కంపెనీ కొంపముంచిన ట్రంప్‌ సంతకం..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top