స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Closing Bell: Sensex, Nifty ends marginally lower amid volatility - Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, ఫార్మా, లోహ షేర్ల అమ్మకాల ఒత్తిడితో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఈ రోజు మొత్తం సూచీలు అమ్మకాల ఒత్తిడిలో కొనసాగాయి. చివరకు స్వల్ప నష్టాలను చవిచూశాయి. ముగింపులో, సెన్సెక్స్ 77.94 పాయింట్లు (0.13%) క్షీణించి 58,927.33 వద్ద స్థిర పడింది, నిఫ్టీ 15.30 పాయింట్లు (0.09%) నష్టపోయి 17,546.70 వద్ద ముగిసింది. నేడు సుమారు 2047 షేర్లు అడ్వాన్స్ చేయబడ్డాయి, 1113 షేర్లు క్షీణించాయి, 162 షేర్లు మారలేదు.  

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ 73.87గా నమోదైంది. కోల్ ఇండియా, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎంలు నిఫ్టీలో అగ్రస్థానంలో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ టాప్ లూజర్లలో ఉన్నాయి. బ్యాంక్ మరియు ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా అన్ని సెక్టోరల్ సూచీలు లాభాలతో ముగిశాయి.

(చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ఫెస్టివల్ సీజనల్‌ ఉద్యోగాలు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top