బ్యాంకింగ్‌ దెబ్బ: లాభాలకు బ్రేక్‌

Banks drag Sensex 53 points down - Sakshi

రికార్డు లాభాలకు స్మాల్‌ బ్రేక్‌

ఐటీ , ఫార్మా రంగాల్లో కొనుగోళ్లు

బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు

15750 దిగువకు నిఫ్టీ

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్‌  స్వల్ప నష్టాలతో ముగిసింది. ఆరంభంలో 100 పాయింట్లుకుపైగా ర్యాలీ అయినప్పటికీ   రికార్డ్‌  పరుగుకు కీలక సూచీలు కాస్త విరామిచ్చాయి.   చివరికి సెన్సెక్స్‌ 53 పాయింట్ల నష్టంతో 52275 వద్ద, నిఫ్టీ 12 పాయింట్ల నష్టంతో 15740 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ కీలక మద్దతు స్థాయి 15750 దిగున ముగిసింది.  ఐటీ, ఫార్మా, మినహా,  మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాల  ఒత్తిడి నెలకొంది.  ఐసీఐసీఐ,  ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పీఎన్‌బీ ,కోటక్ మహీంద్రా లాంటి బ్యాంకింగ్‌ షేర్లతోపాటు  హిందాల్కో, జెఎస్ డబ్ల్యూస్టీల్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీసిమెంట్స్ నష్టపోయాయి. మరోవైపుఅదానీ పవర్‌, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఇన్ఫోసిస్,టెక్ మహీంద్రా,బ్రిటానియా, హెచ్‌సిఎల్ టెక్ లాభపడ్డాయి. అటు యుఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలుక్షీణించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top