రతన్‌టాటాకి అరుదైన ‘వైభవ్‌’ అవార్డు

Assam Government Awarded Asom baibhav Award To Ratan Tata - Sakshi

గణతంత్ర దినోత్సవం రోజున అందరి దృష్టి పద్మ అవార్డుల మీద కేంద్రీకృతమైంది. కానీ అంతకంటే రెండు రోజుల ముందే అరుదైన అవార్డును పారిశ్రామికవేత్త రతన్‌టాటాని వరించింది. తమ రాష్ట్రంలో అత్యున్నత పురస్కారమైన అసోం బైభవ్‌ అవార్డును రతన్‌ టాటాకి అసోం ప్రభుత్వం ప్రకటించింది. రతన్‌ టాటా లాంటి గొప్ప వ్యక్తికి ఈ అవార్డు ప్రకటించడం సముచితం అంటూ అసోం సీఎం హిమంత బిస్వ శర్మ అన్నారు. క్యాన్సర్‌ వ్యాధి నిర్మూలనకు అసోంలో టాటా ట్రస్టు చేపట్టిన కార్యక్రమాలను గుర్తించి ఈ అవార్డు ప్రకటించినట్టు అసోం ప్రభుత్వం తెలిపింది.

అసోం బైభవ్‌ అవార్డును డిసెంబరులో ప్రకటించగా.. ప్రధానం కార్యక్రమం జనవరి 24న గువహాటిలో జరిగింది. అయితే వయో భారం, ప్యాండెమిక్‌ పరిస్థితుల దృష్ట్యా రతన్‌ టాటా ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆయన ప్రతినిధి ఈ అవార్డును స్వీకరించారు. అయితే ముంబైలో రతన్‌ టాటాను స్వయంగా కలిసి అసోం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తానని అసోం సీఎం శర్మ అన్నారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top