● నాడు ఎంపీటీసీ.. నేడు వార్డు సభ్యుడు
అశ్వారావుపేటరూరల్: ఓ మాజీ ఎంపీటీసీ సభ్యుడు తాజా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. మండలంలోని నందిపాడు గ్రామ పంచాయతీ 7వ వార్డు నుంచి సీపీఎం అభ్యర్థిగా మాడి నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశాడు. మరో అభ్యర్థి శనివారం నామినేషన్ ఉపసంహరించుకోవడంతో నాగేశ్వరరావు ఏకగ్రీవమయ్యాడు. ఈయన 2004లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని మామిళ్లవారిగూడెం నుంచి ఎంపీటీసీగా గెలుపొందారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావును సీపీఎం నాయకులు కె.పుల్లయ్య, సొడెం ప్రసాద్, చిరంజీవి అభినందించారు.


