రెండో రోజు 952 నామినేషన్లు
సర్పంచ్ స్థానాలకు 224..
వార్డులకు 728 దాఖలు
చుంచుపల్లి: రెండో దశలో ఎన్నికలు జరగనున్న 155 గ్రామ పంచాయతీలు, 1,384 వార్డులకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఊపందుకుంది. ఏడు మండలాల పరిధిలో రెండో రోజైన సోమవారం మొత్తం 952 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో సర్పంచ్ స్థానాలకు 224 మంది, వార్డు స్థానాలకు 728 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ విడతలో నామినేషన్ల స్వీకరణకు మంగళవారం తుది గడువు కావడంతో నేడు మరింత మంది దాఖలు చేసే అవకాశం ఉంది.
మండలాల వారీగా..
రెండో రోజైన సోమవారం దాఖలైన నామినేషన్ల వివరాలిలా ఉన్నాయి.. అన్నపురెడ్డిపల్లి మండలంలో సర్పంచ్ స్థానాలకు 13, వార్డులకు 92 నామినేషన్లు, అశ్వారావుపేట మండలంలో సర్పంచ్‌కు 42, వార్డులకు 107, చండ్రుగొండలో సర్పంచ్‌కు 28, వార్డులకు 103, చుంచుపల్లిలో సర్పంచ్ 32, వార్డులకు 100, దమ్మపేటలో సర్పంచ్ 46, వార్డులకు 152, ములకలపల్లిలో సర్పంచ్ 28, వార్డులకు 84, పాల్వంచలో సర్పంచ్ 35, వార్డులకు 90 నామినేషన్లు దాఖలయ్యాయి.
సర్పంచ్‌గా తల్లి.. వార్డుసభ్యుడిగా కొడుకు నామినేషన్లు
చండ్రుగొండ: చండ్రుగొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ బరిలో తల్లి భూక్యా సావిత్రి నిలవగా.. ఆమె కుమారుడు భుక్యా రాంపండు 5వ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. సోమవారం వారిద్దరూ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ మద్దతుతో తాము బరిలో నిలిచామని, గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు.
రెండో రోజు 952 నామినేషన్లు
రెండో రోజు 952 నామినేషన్లు


