●మిథిలా.. ఏమిటీ వ్యథ !
మిథిలా నగరం అనగానే రామరాజ్యం గుర్తొస్తుంది. త్రేతాయుగం నాటి ఆ రాజ్యానికి గుర్తుగా భద్రగిరిలో కొలువై ఉన్న శ్రీరాముడి క్షేత్రంలో కల్యాణ వేదిక ప్రాంగణానికి మిథిలా స్టేడియం అని నామకరణం చేశారు. కానీ ఆ పేరుకే అవమానం తెచ్చేలా వ్యవహరిస్తున్నారు ఆలయ అధికారులు. శ్రీరామనవమి రోజుల్లోనే ఆ స్టేడియంలో పరిశుభ్రత పనులు చేపడుతూ అనంతరం ఆలనా పాలన పట్టించుకోవడం లేదు. దీంతో ఆ ప్రాంగణమంతా చిట్టడివిని తలపిస్తోంది. పశువులు, పిచ్చిమొక్కలతో పరిసర ప్రాంతాలు దర్శనమిస్తున్నాయి. స్టేడియాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని భక్తులు కోరుతున్నారు. – భద్రాచలం
●మిథిలా.. ఏమిటీ వ్యథ !


