ఫోరెన్సిక్ సాక్ష్యం కీలకం
కొత్తగూడెంటౌన్: కోర్టులో ఫోరెన్సిక్ సాక్ష్యం కీలకపాత్ర పోషిస్తుందని, ప్రతీ న్యాయవాది ఫోరెన్సిక్ సైన్స్‌పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. జిల్లా కోర్టులోని లైబ్రరీ హాల్‌లో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పాలీగ్రాఫిక్, ఫింగర్ ప్రింట్, నార్కో విశ్లేషణ, లైడిటెక్షన్, సంతక పరీక్ష, డిజిటల్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ ల్యాబ్ విధానాలు, శాసీ్త్రయ విశ్లేషణ పద్ధతుల గురించి వివరించారు. జిల్లాలోని న్యాయవాదులంతా ఈ అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎం.సరిత, ఎం.రాజేందర్, కె.కిరణ్‌కుమార్, కె.కవిత, కె.సాయిశ్రీ, స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఐఎల్‌పీఏ జిల్లా కన్వీనర్ జె.గోపీకృష్ణ, సుంకర భానుప్రియ, న్యాయవాదులు పోసాని రాధాకృష్ణమూర్తి, జె.శివరామ్‌ప్రసాద్, కిలారు పురుషోత్తం, యూనిట్ సభ్యులు అడపాల మహాలక్ష్మి, ఎండీ సాధిక్‌పాషా, ఎర్రపాటి కృష్ణ, ఝెర్రా కామేష్, అంబటి రమేష్, దొడ్డా సామంత్, మేకల దేవేందర్, రాజశేఖర్, శ్రీకాంత్, మారపాక రమేష్, యాస యుగంధర్ అంకూష్‌పాషా, ఇందిరా ప్రియదర్శిని పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్


