భూ సమస్యలు పరిష్కరించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శనివారం ఆరో రోజుకు చేరుకున్నాయి. తుడుందెబ్బ జాతీయ కో కన్వీనర్ కల్తీ సత్యనారాయణ, పోలిబోయిన రామనర్సయ్య, సోయం కన్నారావు, దారబోయిన రమేష్, కారం కృష్ణ తదితరుఉల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఏజెన్సీలో భూ చట్టాలను కఠినంగా అమలు చేయాలని బాధితులు కోరారు. దీక్షల్లో తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు గొగ్గెల రామస్వామి, జారె కృష్ణ, భూ బాధితులు గొగ్గెల ఆదిలక్ష్మి, పూనెం అనసూయ, నరసింహారావు, కల్తీ మల్లయ్య, కుంజా రాములు, పూసం నరసింహారావు, పూనెం కోటయ్య పాల్గొన్నారు.


