అండర్–17 వెయిట్ లిఫ్టింగ్ జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్న ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–17 బాలబాలికల వెయిట్ లిఫ్టింగ్ జట్లను శనివారం ఎంపిక చేశారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో పోటీలు నిర్వహించామని, ప్రతిభ కనబర్చిన వారి నుంచి జట్లను ఎంపిక చేశామని జిల్లా పాఠశాలల క్రీడా సంఘం కార్యదర్శి వై.రామారావు తెలిపారు. బాలుర జట్టుకు ఎం.శ్యామ్, బి.రిషి, జి. శేషు, కె.ధనుష్, పి.దివాకర్, సీహెచ్. శరత్‌చంద్ర, ఎం.భరత్, ఎం.యశ్వంత్, బాలికల జట్టుకు జి.కావ్య, టి.పవిత్ర, ఏ.టోనీశ్రీ, జి.శృతి, సీహెచ్. శ్రీవల్లి, శాంతి, ఎన్.హాసిని ఎంపికయ్యారని వెల్లడించారు.


