ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి
ఇల్లెందురూరల్: శిక్షణలో నేర్చుకున్న అంశాలపై నిరంతరం సాధన కొనసాగిస్తూ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని అదనపు కలెక్టర్, డీఆర్‌డీఓ విద్యాచందన సూచించారు. మండలంలోని యువజన శిక్షణ కేంద్రంలో న్యాక్ ఆధ్వర్యంలో వారం రోజులపాటు యువతకు సెంట్రింగ్ పనిపై శిక్షణ శిబిరం నిర్వహించారు. శనివారం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అనంతరం శిక్షణ పొందిన 60 మంది సభ్యులకు ధ్రువీకరణ పత్రాలు, టీషర్ట్‌లను పంపిణీ చేశారు. ఎంపీడీవో ధన్‌సింగ్, సెర్ప్, న్యాక్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.


