సమగ్ర వ్యవసాయ విధానాలతో నికర ఆదాయం
రఘునాథపాలెం: రైతులు ఎప్పటికప్పుడు ఆధునిక విధానాలు తెలుసుకుని అవలంబించడం ద్వారా పంటల నుంచి నికర ఆదాయం లభిస్తుందని అశ్వారావుపేట వ్యవసాయశాఖల అసోసియేట్ డీన్ హేమంత్‌కుమార్ తెలిపారు. మండలంలోని చిమ్మపూడిలో శనివారం వ్యవసాయశాఖ, ఖమ్మం రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యాన మిరప, ఆయిల్‌పామ్‌పై ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్‌పామ్‌తో పాటు అంతర పంటలు సాగుచేస్తే ఆర్థికంగా స్థిరపడవచ్చ ని చెప్పారు. అలాగే, మిరపలో విత్తనం దశ నుంచి కోత వరకు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించా రు. అనంతరం మల్యాల కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ప్రశాంత్, ఖమ్మం ఏడీఏ కె.వెంకటేశ్వరరావు, రోటరీక్లబ్ గవర్నర్ మల్లాది వాసు మాట్లాడారు. వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు రాంప్రసాద్, నాగాంజలి, నీలిమ, రోటరీక్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వల్లభనేని రామారావు, బొడ్డు సుధాకర్‌రావుతో పాటు కోటేరు వెంకటరెడ్డి, వెంకట్, చందు, ఏఓ కె.ఉమామహేశ్వరరెడ్డి, ఏఈఉలు పాల్గొన్నారు.


