రివిజన్ సమర్థంగా చేపట్టాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు.. తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ హాజరయ్యారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వీసీలో కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, ఎన్నికల సూపరింటెండెంట్ రంగాప్రసాద్ పాల్గొన్నారు.


