పెద్దమ్మతల్లి ఆలయంలో వైభవంగా లక్ష బిల్వార్చన
పాల్వంచరూరల్ : పెద్దమ్మతల్లి ఆలయ సముదాయంలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామికి కార్తీకమాసం సందర్భంగా శనివారం లక్ష బిల్వార్చన గావించారు. ఆ తర్వాత స్వామి సన్నిధిలో సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం, హారతులు, నివేదన సమర్పించగా.. సాయంత్రం ఆకాశదీపం వెలిగించారు. కాగా, క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని ఆదివారం తులసీ కల్యాణం నిర్వహించనున్నట్లు ఈఓ రజనీకుమారి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
‘చెకుముకి’ వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ
కొత్తగూడెంఅర్బన్: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుగనున్న చెకుముకి సంబురాల వాల్ పోస్టర్లను కలెక్టర్ జితేష్ వి.పాటిల్, డీఈఓ నాగలక్ష్మి, ఉమ్మడి జిల్లా పరీక్షల విభాగం కార్యదర్శి నీరజ తమ కార్యాలయాల్లో శనివారం వేర్వేరుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేవీవీ జిల్లా అధ్యక్షుడు సాయిబాబా మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో ఈనెల 7న, మండలస్థాయిలో 21న, జిల్లాస్థాయిలో 28న చెకుముకి సంబరాలు నిర్వహిస్తున్నామని, రాష్ట్ర స్థాయిలో డిసెంబర్ 12 నుంచి 14 వరకు కరీంనగర్‌లో జరుగుతాయని వివరించారు.
పెరుగుతున్న గోదావరి ప్రవాహం
భద్రాచలంటౌన్ : మోంథా తుపాను ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూ శనివారం రాత్రికి 28.50 అడుగులకు చేరుకుంది. నదీ ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు, ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. పుణ్యస్నానాలు ఆచరించే భక్తులను నదిలోకి దిగకుండా చర్యలు చేపట్టారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
పర్యాటక కేంద్రంగా ‘కనకగిరి’
ట్రెయినీ కలెక్టర్ సౌరభ్‌శర్మ
చండ్రుగొండ : మండలంలోని బెండాలపాడు శివారులో గల కనకగిరి గుట్టల ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రతిపాదన ఉందని ట్రెయినీ కలెక్టర్ సౌరభ్‌శర్మ తెలిపారు. శనివారం ఆయన బెండాలపాడు సందర్శించారు. ఆ తర్వాత గ్రామ శివారు అటవీప్రాంతంలో ఉన్న వెదురు ప్లాంటేషన్‌ను పరిశీలించాక గుట్టపై ఉన్న హస్తాల వీరన్నస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కనకగిరి గుట్టలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అన్నారు. తొలుత గ్రామ పంచాయతీ కార్యాలయంలో తహసీల్దార్ సంధ్యారాణి, పంచాయితీ సెక్రటరీ రోహిత్, దిశ కమిటీ సభ్యుడు బొర్రా సురేష్‌తో సమావేశమై గ్రామ జనాభా, దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఎన్ని ఉన్నాయని ఆరా తీశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, సీతారామ కాలువ పనులు ఎంత వరకు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు.
నేడు ఉమ్మడి జిల్లాలో
మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పంటల పరిశీలన, ఖమ్మం రూరల్ మండలంలో సీసీ రోడ్లకు శ ంకుస్థాపన తర్వాత ఇల్లెందులో పలు ప్రైవేట్ కార్యక్రమాలకు పొంగులేటి హాజరవుతారు.
పెద్దమ్మతల్లి ఆలయంలో వైభవంగా లక్ష బిల్వార్చన
పెద్దమ్మతల్లి ఆలయంలో వైభవంగా లక్ష బిల్వార్చన
పెద్దమ్మతల్లి ఆలయంలో వైభవంగా లక్ష బిల్వార్చన


