56 లీటర్ల నాటుసారా పట్టివేత
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణం మీదుగా పాల్వంచకు తరలిస్తున్న నాటుసారాను ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ శ్రీహరిరావు కథనం ప్రకారం.. భద్రాచలం గోదావరి బిడ్జి సమీపంలోని ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ ద్విచక్రవాహనాన్ని అపి తనిఖీ చేశారు. 56 లీటర్ల నాటుసారా దొరకడంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా పాల్వంచకు చెందిన గంగా కబాసి, సింగా కుర్మీగా తేలింది. ఇద్దరు వ్యక్తులపై కేసు నమెదు చేసి నాటుసారా, ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసిన్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు. తనిఖీల్లో కానిస్టేబుల్ కరీం, బాలు, సుధీర్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.


