పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి)ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. కాగా ఏకాదశి సందర్భంగా శనివారం ఉదయం 10 గంటల నుంచి శ్రీ సత్యనారాయణ వ్రతం నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అమరులను
స్ఫూర్తిగా తీసుకోవాలి
భద్రాచలంఅర్బన్: విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరుల స్ఫూర్తితో పోలీసులు పనిచేయాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా శుక్రవారం పట్టణంలో అన్నపూర్ణ ఫంక్షన్ హాల్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. భద్రాచలం న్యాయమూర్తి శివనాయక్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, పోలీస్ సిబ్బంది, పలువురు యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ మాట్లాడారు. రక్తదానం దివ్యాంగులను అభినందించారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న 100 మంది పోలీసులకు, యువకులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అత్యధికంగా ఓఈఆర్ నమోదు
అప్పారావుపేట ఆయిల్‌పామ్
ఫ్యాక్టరీలో 20.01 శాతం
అశ్వారావుపేట: దమ్మపేట మండలం అప్పారావుపేట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలో ఓఈఆర్ అత్యధికంగా 20.01శాతం నమోదైంది. గెలల నుంచి నూనె వచ్చే శాతాన్ని ఓఈఆర్(ఆయిల్ ఎక్ట్రార్షన్ రేష్యో)ను తెలంగాణ ఆయిల్‌ఫెడ్ నమోదు చేస్తుంది. అప్పారావుపేటలో నమోదయ్యే ఓఈఆర్‌ను అనుసరించే ఆయిల్‌పామ్ గెలల ధరను నిర్ణయిస్తారు. అప్పారావుపేట ఫ్యాక్టరీకి నవంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025(ఆయిల్ ఇయర్) వరకు 2,26,409 టన్నుల గెలలు, అశ్వారావుపేట ఫ్యాక్టరీకి 1,01,893 టన్నుల గెలలను రైతులు సరఫరా చేశారు. వీటిని క్రషింగ్ చేయగా అప్పారావుపేటలో 20.01శాతం, అశ్వారావుపేటలో 19.47 శాతం ఓఈఆర్ నమోదయింది. కాగా గతంలో ఆఈఆర్ 19.42శాతమే అత్యధికం. ఈసారి జరగనున్న ఓఈఆర్ సమావేశంలో రానున్న ఆయిల్ ఇయర్‌కు ఓఈఆర్‌ను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
ఇల్లెందురూరల్: ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. మండలంలోని కొమరారం హైస్కూల్‌లో శుక్రవారం ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రిటైర్డ్ ఉపాధ్యాయుల పెండింగ్ బెనిఫిట్స్, జీపీఎఫ్, డీఏలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలని కోరారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని, ఆశ్రమ పాఠశాలల్లో పండిట్, పీఈటీలను అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. బి.రాజు, వెంకటేశ్వర్లు, కిషోర్‌సింగ్, టి.బాలు, హతిరాం, జయరాజు, రాంబాబు, రూప్‌సింగ్ పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం


