సామాజిక మాధ్యమాలను అతిగా వినియోగించొద్దు
కొత్తగూడెంటౌన్: బాలలు ఇంటర్నెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని, సామాజిక మాధ్యమాలను అతిగా వినియోగించకూడదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ సూచించారు. శుక్రవారం జిల్లా కోర్టు మీటింగ్ హాల్‌లో జిల్లాస్థాయి అధికారులు భరోసా, షీటీం, బాలల సంక్షేమ కమిటీ సైబర్ క్రైం, పారా లీగల్ వలంటీర్లకు ఒక్క రోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమిషానికి 16 మంది ఇంటర్నెట్‌లో వేధింపులకు గురవుతున్నారని అన్నారు. అతిగా ఇంటర్నెట్‌ను వినియోగించడం వల్ల బాలల్లో శారీరక రుగ్మతలు వస్తున్నాయని తెలిపారు. సామాజిక మాధ్యమాలతో జరిగే నష్టాలపై న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కోప్ ఆర్టి కో ఆర్డినేటర్ సుజాత, సైబర్ నిపుణుడు వెంకి నాయుడు, భరోసా ఎస్‌ఐ అరుణ, ఎస్‌ఐలు రమాదేవి, షేక్ జుబేదా, బాలల సంక్షేమ సమితి సభ్యులు సుమిత్రాదేవి, సాధిక్ పాషా పాల్గొన్నారు..
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి రాజేందర్


