దుర్గంధం వెదజల్లుతున్న టాయిలెట్లు
ఈఎంఆర్‌ఎస్‌లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. టాయిలెట్లు దుర్గంధం వెదజల్లుతున్నాయి. సగం మరుగుదొడ్లు పనిచేయడంలేదు. బాత్రూంలలో పంపులు విరిగిపోయాయి. బట్టలు ఉతుక్కునే వాష్ ఏరియా అపరిశుశ్రంగా మారింది. ఇక పాఠఽశాల ఆవరణలో పిల్లలు తినే కోడిగుడ్లు పడేసి ఉన్నాయి. మెనూ కూడా సక్రమంగా అమలు కావడంలేదని, కూరల్లో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. టిఫిన్‌లో చట్నీ వడ్డించడంలేదని, తెలంగాణా సంస్కృతి అయినా బతుకమ్మ వేడుకలకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. తరగతి గదుల్లో బోర్డులు కూడా లేవన్నారు. సమస్యలను ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధిలకు చెబితే సిబ్బంది బెదిరింపులకు గురిచేస్తున్నారని విద్యార్థులు వాపోయారు.


