
ఎరువుల దకాణాల్లో తనిఖీలు
దమ్మపేట : మండల పరిధిలోని పలు ఎరువుల దుకాణాల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మండలంలోని దమ్మపేట, మొద్దులగూడెం, నాచారం, నాగుపల్లి గ్రామాల్లోని దుకాణాల్లో స్టాక్, రికార్డులను తనిఖీ చేశారు. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల వ్యవసాయ అధికారి శీలం చంద్రశేఖర రెడ్డి, ఏఈఓలు పాల్గొన్నారు.
ఆయిల్ పామ్
ప్లాంటేషన్ డ్రైవ్..
దమ్మపేట : మండలంలోని దురదపాడు, లింగాలపల్లి గ్రామాల్లో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో గురువారం ఆయిల్‌పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. 147 ఎకరాల విస్తీర్ణంలో 63 మంది రైతుల వ్యవసాయ క్షేత్రాల్ల మొక్కలు నాటారు. ఆయిల్‌ఫెడ్ డివిజనల్ మేనేజర్ రాధాకృష్ణ, ఫీల్డ్ ఆఫీసర్లు సతీష్, అప్పారావు, అర్షద్, రైతులు సోయం ప్రసాద్, మడకం రాజేష్, ఎర్రా వసంతరావు, శేషుబాబు, కాసాని నాగప్రసాద్, మంగేశ్వరరావు పాల్గొన్నారు.
భద్రాచలం ఆస్పత్రిలో ఖరీదైన శస్త్రచికిత్స
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో గురువారం ఓ మహిళకు ఖరీదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజరకు చెందిన రమణ అనే మహిళకు గాల్ బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడటంతో ఈ నెల 9న ఆస్పత్రిలో చేరింది. దంతో వైద్యులు రామకృష్ణ, వెంకట్, నిఖితలు ల్యాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ నిర్వహించి గాల్ బ్లాడర్ తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండగా, జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఇలాంటి శస్త్రచికిత్స నిర్వహించడం ఇదే తొలిసారి అని సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ తెలిపారు. ఇదేచికిత్స ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిర్వహిస్తే రూ. 2 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు పేర్కొన్నారు.
నిందితుడి కోసం గాలింపు
నేలకొండపల్లి: అత్యాచారం కేసులో నిందితుడి కోసం భద్రాద్రి జిల్లా గుండాల పోలీసులు గాలిస్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురానికి చెందిన కుంభం వీరబాబు 2019లో గుండాల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు కాగా, కోర్టు వాయిదాలకు హాజరుకావడం లేదు. దీంతో గురువారం గుండాల సీఐ ఎల్.రవీందర్, సిబ్బంది రాజేశ్వపురం వచ్చి ఆయన ఆచూకీ కోసం ఆరా తీశారు. ఆగస్టు 13లోగా న్యాయస్థానంలో హాజరయ్యేలా చూడాలని బంధువులకు సూచించారు. కాగా, వీరబాబు ఆచూకీ తెలిసిన వారు 87126 82082, 87126 82084 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.

ఎరువుల దకాణాల్లో తనిఖీలు