
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): దమ్మపేట మండలం నాచారం గ్రామానికి చెందిన గద్దల రాధాకృష్ణ(30) గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బైక్‌పై కొత్తగూడెం వెళ్లొస్తుండగా అన్నపురెడ్డిపల్లి మండలం బుచ్చన్నగూడెం గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటో ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.
విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి
చర్ల: మండలంలోని సుబ్బంపేటకు చెందిన పైవేట్ ఎలక్ట్రీషియన్ కనితి శాంతమూర్తి (30) గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గ్రామంలోని ఓ ఇంటి వద్ద వాల్ కటింగ్ మిషన్‌తో గోడకు రంధ్రాలు చేస్తుండగా విద్యుదాఘతానికి గురై పడిపోయాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో ఇంటి యజమాని సామ్రాజ్యం కూడా విద్యుదాఘాతానికి గురైంది. ఇద్దరిని కొ య్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, శాంతమూర్తి అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు
చండ్రుగొండ: రోడ్డు ప్రమాదంలో గురువారం ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అన్నపురెడ్డిపల్లికి చెందిన గుండు మాధవి తోటి కూలీలతో కలిసి ఆటోలో పనికి వెళ్లి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో అన్నపురెడ్డిపల్లి వద్ద ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ పక్కన కూర్చున్న మాధవి కాలు తెగి దూరంగా పడింది. ఆటోలోని మిగతా కూలీలకు ఎలాంటి గాయాలూ కాలేదు. ఎస్సై చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రురాలిని తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి