
చోరీ కేసుల్లో ముగ్గురి అరెస్ట్
సుజాతనగర్: జిల్లాలోని సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, బూర్గంపాడు, భద్రాచలం, అశ్వాపురం, మణుగూరు, చర్ల తదితర ప్రాంతాల్లో ఇళ్లల్లో చొరబడి చోరీలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులతో పాటు, అపహరించిన బంగారాన్ని కొనుగోలు చేసిన వ్యా పారిని సుజాతనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ వివరాలు వెల్లడించారు. భద్రాచలం సీతారాం నగరం కాలనీకి చెందిన షేక్ ధారుక్‌బాబా చిన్నప్పటి నుంచి జల్సాలకు అలవాటై పదేళ్లుగా దొంగతనాలు చేస్తున్నాడు. ఇతను గతంలో పాల్వంచ, భద్రాచలం ప్రాంతాల్లో చోరీ లకు పాల్పడగా అరెస్టయి కొన్ని నెలల పాటు జైలు లో ఉండి వచ్చాడు. తరువాత మోతెకు చెందిన స్నే హితుడు అఖిల్‌తో కలిసి సుజాతనగర్‌లో ఒక చోరీ, మణుగూరుకు చెందిన మరో స్నేహితుడు సూర్యప్రకాశ్‌తో కలిసి బూర్గంపాడులో చోరీ, ఎటపాకకు చెందిన పేరాల నరసింహారావు, భద్రాచలానికి చెందిన అల్లాడ రవీందర్, ఖమ్మానికి చెందిన ఎండీ మతిన్‌తో కలిసి భద్రాచలంలో రెండు చోరీలకు పాల్పడ్డాడు. ఈ చోరీలే కాకుండా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో 14 చోట్ల దొంగతనాలకు పాల్పడి బంగారం
,వెండి వస్తువులను దోచు కున్నాడు. ఇలా చోరీలతో వచ్చిన సొమ్ములో కొంత అఖిల్, సూర్యప్రకాశ్, నల్లమటి సాయిరాంకు ఇస్తుండేవాడు. బంగారు, వెండి వస్తువులను భద్రాచలంలోని బంగారు షాపు యజమానులైన వల్లే విజయరావు, గొర్ల శ్రీనుకు విక్రయించాడు. కొంత బంగారాన్ని అమ్మేందుకు మంగళవారం ద్విచక్రవాహనంపై ఖమ్మం వెళ్తుండగా వాహన తనిఖీల్లో సుజాతనగర్ పోలీసులకు పట్టుబడినట్లు డీఎస్పీ వెల్లడించారు. ధారూక్‌బాబా, నలమటి సాయిరాం, బంగారు, వెండి వస్తువులు కొన్న వల్లే విజయరావును అరెస్ట్ చేశామని, వారి నుంచి 36 తులాల బంగారం, 102 తులాల వెండి, ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో చుంచుపల్లి సీఐ రాయల వెంకటేశ్వర్లు, సీసీఎస్ సీఐ రమాకాంత్, ఎస్‌ఐలు ఎం. రమాదేవి, ప్రవీణ్, క్లూస్ టీం సీఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
36 తులాల బంగారం, 102 తులాల
వెండి స్వాధీనం