
మాజీ ఎమ్మెల్యే రేగాకు మాతృవియోగం
కరకగూడెం/బూర్గంపాడు: బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తల్లి నర్సమ్మ (85) బుధవారం తెల్లవారుజామున మండలంలోని కుర్నవెల్లిలో స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె మృతి సమాచారం తెలియగానే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తదితరులు కాంతారావును ఫోన్‌లో పరామర్శించారు. అలాగే, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ, చందా లింగయ్య, తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావుతో పాటు నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బడే నాగజ్యోతి, లక్ష్మణ్, తుళ్లూరి బ్రహ్మయ్య, చందా సంతోష్‌కుమార్, నబీ, జాఫర్ హుస్సేన్, గిన్నారపు రాజేశ్, హరిప్రసాద్‌యాదవ్, చాంద్‌పాషా, ఉపేందర్ నరసమ్మ మృతదేహం వద్ద నివాళులర్పించి ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కాగా, రేగా కాంతారావును రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పరామర్శించారు. ఎంపీ హైదరాబాద్ నుంచి వచ్చేలోగా నరసమ్మ అంత్యక్రియలు పూర్తికావడంతో రేగా నివాసంలో ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
సంతాపం తెలిపిన మాజీ సీఎం కేసీఆర్

మాజీ ఎమ్మెల్యే రేగాకు మాతృవియోగం