
రేగులగండి చెరువులో కార్మికుడి గల్లంతు
మణుగూరుటౌన్: సమ్మె నేపథ్యంలో ఆటవిడుపుగా రేగులగండి చెరువుకు వెళ్లిన కార్మికుల బృందంలో ఒకరు గల్లంతైన ఘటన కలకలం సృష్టించింది. తోటి కార్మికుల కథనం ప్రకారం.. సింగరేణి కాల రీస్ మణుగూరు ఏరియాలోని పీకేఓసీ కార్మికులు సుమారు 15 మంది బృందంగా ఏర్పడి కూనవరం పంచాయతీలోని రేగులగండి వద్దకు వెళ్లారు. సాయంత్రం ఈతకు దిగిన ఓసీ–2 ఈపీ ఆపరేటర్ సుంకరి శ్రీనివాస్ ఎంతకూ బయటికి రాకపోవడంతో రెస్క్యూ సిబ్బందికి, జాలర్లకు సమీప గ్రామస్తులకు సమాచారం అందించగా.. వారు వచ్చి గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. గురువారం ఉదయం 8 గంటలకు గాలింపు చర్యలు చేపడతామని రెస్క్యూ సిబ్బంది పేర్కొన్నారు.

రేగులగండి చెరువులో కార్మికుడి గల్లంతు