దుగినేపల్లి వాసికి డాక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

దుగినేపల్లి వాసికి డాక్టరేట్‌

Jul 8 2025 5:04 AM | Updated on Jul 8 2025 5:04 AM

దుగిన

దుగినేపల్లి వాసికి డాక్టరేట్‌

పినపాక: పినపాక మండలంలోని దుగినేపల్లికి చెందిన పంతగాని చందర్‌రావు సోమవారం వరంగల్‌లో జరిగిన కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో డాక్టరేట్‌ అందుకున్నారు. ఫిజిక్స్‌ విభాగంలో ఆయన సమర్పించిన పరిశోధనాత్మక పత్రానికి డాక్టరేట్‌ ప్రకటించగా, యూనివర్సిటీ చాన్స్‌లర్‌, గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, వీసీ ప్రతాప్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలువురు చందర్‌రావును అభినందించారు.

కాళేశ్వరరావుకు...

పాల్వంచరూరల్‌: మండలంలోని కిన్నెరసానికి చెందిన మంత్రి సూర్యప్రకాశ్‌రావు – సువర్ణాదేవి దంపతుల కుమారుడైన కాళేశ్వరరావు అర్ధశాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ సాధించారు. వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ చేతుల మీదుగా ఆయన డాక్టరేట్‌ అందుకున్నారు.

భద్రాచలం వాసి మంజులాదేవికి...

భద్రాచలంటౌన్‌: భద్రాచలంకు చెందిన బుడగం మంజులాదేవి ‘సాహిత అకాడమీ అవార్డు విన్నింగ్‌ నోవెల్స్‌ – స్టడీ ఆఫ్‌ సెలెక్ట్‌ ఇంగ్లిష్‌ నొవెల్స్‌‘ అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి డాక్టరేట్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా కేయూలో సోమవారం జరిగిన స్నాతకోత్సవంలో ఆమె గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.

దుమ్ముగూడెం వాసికి బంగారు పతకాలు

దుమ్ముగూడెం: దుమ్ముగూడేనికి లంక కనకదుర్గ కేయూ స్నాతకోత్సవంలో చాన్స్‌లర్‌, గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ చేతు ల మీదుగా మూడు బంగారు పతకాలు అందుకున్నారు. ఎమ్మెస్సీ గణితం పూర్తిచేసిన ఆమె బంగారు పతకాలు అందుకోగా కుటుంబీకులు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు.

దుగినేపల్లి వాసికి డాక్టరేట్‌1
1/3

దుగినేపల్లి వాసికి డాక్టరేట్‌

దుగినేపల్లి వాసికి డాక్టరేట్‌2
2/3

దుగినేపల్లి వాసికి డాక్టరేట్‌

దుగినేపల్లి వాసికి డాక్టరేట్‌3
3/3

దుగినేపల్లి వాసికి డాక్టరేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement