రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Jul 5 2025 6:20 AM | Updated on Jul 5 2025 6:20 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ఇల్లెందురూరల్‌: మండలంలోని మామిడిగూడెం గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాంకుడోత్‌ వినోద్‌ (35) మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. బోయితండా పంచా యతీ లక్ష్మీనారాయణతండాకు చెందిన వాంకుడోత్‌ వినోద్‌, అదే గ్రామానికి చెందిన ప్రేంకుమార్‌ బైక్‌పై ఇల్లెందుకు వచ్చి తిరుగు ప్రయాణంలో మామిడిగూడెం వద్ద ఎదురుగా వచ్చిన ఆటోను తప్పింబోయి నేరుగా చెట్టుకు ఢీకొన్నారు. ప్రమాదంలో వినోద్‌ అక్కడికక్కడే మృతి చెందగా ప్రేంకుమార్‌కు గాయాలయ్యాయి. ఇతడిని స్థానికులు ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇల్లెందు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

అపస్మారక స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి

ఇల్లెందురూరల్‌/ఇల్లెందు: మండలంలోని సుభా ష్‌నగర్‌ గ్రామ పంచాయతీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో గుర్తుతెలియ ని వ్యక్తి రెండు రోజులుగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న ఇల్లెందు పోలీసులు అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యు ల సూచన మేరకు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు 87128 2070 నంబర్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి కోరారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

జూలూరుపాడు: రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ బాదావత్‌ రవి కథనం ప్రకారం.. సుజాతనగర్‌ మండలం చింతలతండాకు చెందిన మాలోత్‌ వినోద్‌కుమార్‌ జూలూరుపాడు మండల పరిసర ప్రాంత గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు రేషన్‌ బియ్యం కొనుగోలుచేసి, అధికధరకు అమ్ముకుంటున్నాడు. గుండ్లరేవు గ్రామం నుంచి వినోద్‌కుమార్‌ తన ట్రాలీలో రేషన్‌బియ్యాన్ని సుజాతనగర్‌ వైపు తరలి స్తుండగా భేతాళపాడు వద్ద పోలీసులు పట్టుకున్నారు. 5 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం, ట్రాలీని స్వాధీనం చేసుకుని, వినోద్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని, బియ్యం విలువ సుమారు రూ.11,000 ఉంటుందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రవి పేర్కొన్నారు.

వివాహిత ఆత్మహత్య

బూర్గంపాడు: మండల కేంద్రంలోని ముదిరాజ్‌బజార్‌కు చెందిన నీరుడు సంధ్య (38) శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంధ్య తీవ్ర మనోవేదనకు గురవుతోంది. కుటుంబసభ్యులు పలు ఆస్పత్రుల్లో చూపించారు. శుక్రవారం భర్త శేషయ్య పనులకు వెళ్లిన తరువాత సంధ్య ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఇద్దరు కుమారులు చంద్రశేఖర్‌, లోకేశ్‌ ఉన్నారు. మృతురాలి చెల్లెలు మేకల లీలావతి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

ములకలపల్లి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు సీజ్‌ చేశారు. ఎస్‌ఐ రాజశేఖర్‌ కథనం మేరకు.. మండలంలోని సీతారాంపురం శివారు వాగు నుంచి ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందగా శుక్రవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఇసుక తోలుతున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి 1
1/1

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement