
యార్డు ఉన్నా.. ఉపయోగం సున్నా
పాల్వంచ: పాల్వంచలో డంపింగ్ యార్డ్‌కు గతంలో 11 ఎకరాలు కేటాయించారు. అయినా పలుచోట్ల రోడ్లపైనే చెత్త వేస్తున్నారు. శివనగర్ పక్కన ఇప్పటికే భారీ డంపింగ్ యార్డు ఉంది. మసీదు గుట్టకు వెళ్లే దారిలోనూ చెత్త డంప్ చేస్తున్నారు. జెన్‌కో స్థలంలో మరో చోట చెత్త పడేస్తున్నారు. నవభారత్ వెనుక పునాది రాయి అక్రమ తరలింపుతో అక్కడ లోతైన గుంతలు ఏర్పడగా ప్రస్తుతం వాటిలోనూ చెత్త పడేస్తున్నారు. ఇలా అనేక చోట్ల డంపింగ్ యార్డులు ఉండడంతో దుర్వాసన భరించలేకపోతున్నామని పట్టణ వాసులు అంటున్నారు. డివిజన్‌లో 24 వార్డుల ద్వారా రోజుకు 18 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతోంది. తరలింపునకు 8 ట్రాక్టర్లు, 26 స్వచ్ఛ ఆటోలు నడుస్తున్నాయి.
ఒకేచోట డంప్ చేయాలి
పాల్వంచలో మూడు, నాలుగు చోట్ల చెత్త డంప్ చేస్తున్నారు. శివనగర్, మసీద్ గుట్ట, జెన్‌కో స్థలం, జగ్గుతండాల్లో చెత్త వేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాలవారు ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్ సూచించిన జగ్గుతండా వద్దే డంపింగ్ చేయాలి.
–సాంబశివరావు, పాల్వంచ
●

యార్డు ఉన్నా.. ఉపయోగం సున్నా