
రోడ్డుపైనే చెత్త..
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో 29 డివిజన్లు ఉండగా.. వెలువడుతున్న చెత్తను పాతకొత్తగూడెంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గతంలో రామవరంలో ఉన్న డంపింగ్ యార్డ్ సామర్థ్యానికి మించి చెత్త వెలువడుతుండగా.. దుర్వాసన, చెత్త కాల్చడంతో వెలువడే పొగతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వారి ఆందోళనతో చెత్తను పాతకొత్తగూడెం డంపింగ్ యార్డుకు మార్చారు. గత నాలుగేళ్లుగా అక్కడే డంప్ చేస్తున్నా.. ప్రస్తుతం ఆ స్థలం కూడా సరిపోక రోడ్డుపైనే పడేస్తున్నారు. కొత్త డంప్ యార్డ్‌ల ఏర్పాటుకు డీఎంఏకు ప్రతిపాదనలు పంపించిన అధికారులు.. స్థలాల ఎంపిక పనిలో పడ్డారు. పట్టణంలో నిత్యం 31 టన్నుల చెత్త వెలువడుతుండగా తరలింపునకు 36 ట్రాలీలు, ఐదు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, డీజిల్, నిర్వహణ ఖర్చులు నెలకు రూ.35 లక్షలు అవుతోందని అధికారులు వెల్లడించారు.
పగలు, రాత్రి తేడా లేదు
పాతకొత్తగూడెంలో ఇళ్ల సమీపంలోనే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. చెత్త తీసుకొచ్చే వాహనాలు రాత్రీ పగలు తేడా లేకుండా తిరుగుతూనే ఉంటాయి. వాహనాలు చప్పుడు, చెత్త నుంచి వచ్చే దుర్వాసనతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం.
– మరియమ్మ, పాతకొత్తగూడెం
●

రోడ్డుపైనే చెత్త..