చిన్నారికి ప్రాణం పోశారు.. | Sakshi
Sakshi News home page

చిన్నారికి ప్రాణం పోశారు..

Published Fri, Nov 10 2023 12:34 AM

ఐసీయూలో చికిత్స పొందుతున్న బాలిక   - Sakshi

భద్రాచలంఅర్బన్‌: ఏపీలోని వీఆర్‌పురం మండలం సోపెల్లి గ్రామానికి చెందిన ధర్ముల మారాత అనే ఏడు సంవత్సరాల పాప ఈ నెల 2న అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి ఇంట్లో పడి ఉంది. గమనించిన తల్లిదండ్రులు మరుసటి రోజు భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి పాప ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్పారు. చికిత్స అందిస్తుండగా పాప గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అత్యవసర పరిస్థితుల్లో పాపకు సీపీఆర్‌, ఇంటుబేషన్‌ చేసి వెంటిలేటర్‌పై పాపను ఉంచి చికిత్స అందించారు. నాలుగు రోజుల చికిత్స పాప పూర్తిగా కోలుకోగా, గురువారం వైద్యులు డిశ్చార్జి చేశారు. బతకదని భావించిన తమ కూతురికి ప్రభుత్వ వైద్యులు ప్రాణాలు పోశారని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. నాలుగు రోజులపాటు పాపకు ఏరియా ఆస్పత్రి వైద్యులు అందించిన చికిత్స పాము కాటుకు సంబంధించినది కాగా, పాపకు మాత్రం ఎక్కడా పాము కాటు వేసిన ఆనవాలు లేకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామకృష్ణ, ఆర్‌ఎంఓ డాక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డి తదితరులు వైద్యులు, సిబ్బందిని అభినందించారు.

భద్రాచలం ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్యం

 
Advertisement
 
Advertisement