బ్యాడ్మింటన్‌, కరాటే జట్ల ఎంపిక | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌, కరాటే జట్ల ఎంపిక

Published Fri, Nov 10 2023 12:34 AM

బాలుర బ్యాడ్మింటన్‌ జట్టుతో కోచ్‌లు  - Sakshi

ఖమ్మం స్పోర్ట్స్‌: జిల్లా పాఠశాలల క్రీడల సంఘం ఆధ్వర్యాన ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో గురువారం ఉమ్మడి జిల్లా స్థాయి అండర్‌–14, 17 బాలబాలికల బ్యాడ్మింటన్‌, కరాటే ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 250 మంది క్రీడాకారులు హాజరు కాగా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జట్ల వివరాలను జిల్లా క్రీడల సంఘం కార్యదర్శి కె.నర్సింహారావు వెల్లడించారు. అండర్‌–14 బాలుర బ్యాడ్మింటన్‌ జట్టుకు విశ్వతేజ, వినయ్‌, మేఘ, వర్షిత్‌, విష్ణుతేజ, బాలికల జట్టుకు రితికశ్రీ, చరితశ్రీ, చిద్విలాసిని, నవరత్‌, తాబాసం, స్మైలీ ఎంపికయ్యారని తెలిపారు. అండర్‌ – 17 బాలురలో తేజస్వివేక్‌, త్రివిక్రమ్‌, అరవింద్‌, కార్తీక్‌, సందీప్‌, బాలికల జట్టుకు తులసి శ్రీజ, దివ్య, అమృత, లోహిత, శృతి ఎంపిక కాగా, కరాటే అండర్‌–14 బాలుర జట్టుకు శివకళ్యాణ్‌, అబ్దుల్‌ రఫీబ్‌, సాయి హర్షిత్‌, మర్రిమను, తనూష రఘురాం, ఉదయ్‌ కిరణ్‌, ఇర్ఫాన్‌, కృష్ణతేజ, బాలికల జట్టుకు గోపజ, నివేదిత, నందిత, శైలుకుమారి, అలీషా ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఇక అండర్‌–17 బాలుర జట్టుకు మధుకర్‌రెడ్డి, నరేంద్రబాబు, సాయివరుణ్‌, హర్షతేజ, ప్రణయ్‌రాజ్‌, ఆదిల్‌పాషా, అసదుద్దీన్‌, వెంకటధనుష్‌, సాయిచరణ్‌, బాలికల జట్టుకు అక్షయ, వైష్ణవి, రిషిత, సింధూర, కావ్య చౌదరి, తన్వీర్‌, నిఖిత ఎంపికయ్యారని తెలిపారు.

 
Advertisement
 
Advertisement