వేతన వెతలు | - | Sakshi
Sakshi News home page

వేతన వెతలు

May 23 2026 1:52 AM | Updated on May 23 2026 1:52 AM

శనివారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2026 పులిచింతల సమాచారం సాగర్‌ నీటిమట్టం నిమ్మకాయల ధరలు కారంచేడు: ప్రతి నెలా ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న చంద్రబాబు సర్కార్‌ ఏ ఒక్క నెలా సరిగా ఇచ్చిన దాఖలాలు లేవని ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంటే కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రం ప్రతి సంవత్సరం ఉద్యోగం రెన్యువల్‌ లెటర్‌ ఆధారంగానే వేతనాలు అందిస్తున్నారు. ఈ ఏడాది కూడా కాంట్రాక్టు ఉద్యోగులకు అవసరమైన రెన్యూవల్‌ లెటర్‌ విడుదల చేయడంలో ఆలస్యమైంది. దీంతో వేల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులు ఆర్థికంగా ఒకేసారిగా అతలాకుతలం అయ్యారు. మార్చి నుంచి మే నెల వరకు వేతనాలు నిలిచిపోయాయి. దీంతో బాపట్ల జిల్లాలో వివిధద శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న సుమారు 2 వేల మందికి కుటుంబ పోషణ భారంగా మారి అల్లాడిపోతున్నారు. మూడు నెలలుగా జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ఆరా తీయగా.. ప్రస్తుతం వారికి అందించే సీఎంఎంఎస్‌ పద్ధతి నుంచి నిధి పోర్టల్‌కు ఉద్యోగుల డేటా బదిలీ అవుతున్న కారణంగా వేతనాలు ఆలస్యం అవుతున్నాయని అధికారుల నుంచి సమాధానం వస్తోంది. ఇదే విషయాన్ని కాంట్రాక్టు ఉద్యోగులు చెబుతున్నారు. మార్చి వరకు కాంట్రాక్టు ఉద్యోగుల పొడిగింపు ఉత్తర్వులు ఉన్నప్పటికీ మార్చి నెలలో కూడా తమకు జీతాల బిల్లు పెట్టకపోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల్లో ప్రధానంగా వైద్య, ఆరోగ్య శాఖలో ఎక్కువ మంది ఉద్యోగులున్నారు. వీరు ల్యాబ్‌ టెక్నీషియన్లు, స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలు ఉన్నారు. పీహెచ్‌సీల నుంచి అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రి వరకు ఉన్న వివిధ కేడర్‌ ఉద్యోగులు ఉన్నారు. ప్రతి ఏడాది క్రాంట్రాక్టు ఉద్యోగులకు ఏప్రిల్‌ నుంచి తరువాత ఏడాది మార్చి నెల వరకు పొడిగింపు ఉత్తర్వులు ఇస్తారు. తరువాత సంవత్సరం మార్చి నెలాఖరులోగా మరో ఏడాది పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ ఈ ఏడాది మార్చి నెల వరకు పొడిగింపు ఉన్నప్పటికీ వేతనాలు వేయలేదని వారు వాపోతున్నారు. ఇక ఈ ఏడాది కూడా ఏప్రిల్‌ దాటి మే నెల కూడా వచ్చిందని, ఈ నెల కూడా 22వ తేదీ వచ్చినా ఇంత వరకు వేతనాలు అందలేదన్నారు. జూన్‌ నెలకు అయినా వేతనాలు సక్రమంగా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. వేతనాలను విడుదల చేయించడానికి యూనియన్‌ నాయకులు అనేక మార్లు శాఖల అధిపతులను కలసి అభ్యర్థిస్తున్నామని చెబుతున్నారు. అవకాశం ఉన్న చోట మంత్రులకు కూడా తమ గోడును వినిపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మొత్తం జీతం అందించాలి కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనాలు అందించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. వంద శాతం గ్రాస్‌ శాలరీ ఇవ్వాలని అనేక మార్లు అనేక యూనియన్లు డిమాండ్‌ చేస్తూనే ఉన్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇచ్చి వారికి హెల్త్‌ కార్డులు, పీఎఫ్‌, ఈఎస్‌ఐల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నాం. ప్రస్తుతం మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం మార్చి నుంచి ఇప్పటి వరకు అంటే మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. గతంలో ఇన్ని నెలలు ఒకేసారి వేతనాలు నిలచిన సందర్భాలు లేవు. ఈ సారి వరుసగా మూడు నెలలు నిలచిపోవడం వలన ఇంటి నిర్వహణ భారం ఎక్కువైంది. ఈఎంఐలు కట్టుకోవడారికి మరొ చోట అప్పు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి వెంటనే వేతనాలు అందించాలి. వెంటనే వేతనాలు చెల్లించాలి బాపట్ల జిల్లాలో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహించే ఉద్యోగులు వేల సంఖ్యలో ఉన్నారు. వీరందరికీ మూడు నెలల నుంచి వేతనాలు అందడం లేదు. ఆర్థికంగా అవస్థలు పడుతున్నాం. మార్చి నుంచి వేతనాలు అందడం లేదు. కాంట్రాక్టు కొనసాగింపు ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అయినా ఇంకా ఆలస్యం చేయకుండా ఉన్నతాధికారులు స్పందించి మాకు రావాల్సిన వేతనాలను విడుదల చేయాలని కోరుతున్నాం.

న్యూస్‌రీల్‌

మూడు నెలలుగా అందని జీతాలు జిల్లాలో 2 వేల మందికిపైగా కాంట్రాక్టు ఉద్యోగులు భారంగా మారిన కుటుంబ పోషణ చంద్రబాబు సర్కారు తీరుపై ఆగ్రహం

బాపట్ల
శనివారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2026

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.2126 టీఎంసీలు.

విజయపురి సౌత్‌: నాగార్జునసాగర్‌ నీటిమట్టం శుక్రవారం 523.90 అడుగులకు చేరింది. సాగర్‌ నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదల అవుతోంది.

తెనాలి: స్థానిక మార్కెట్‌ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.3,000, గరిష్ఠ ధర రూ.6,200, మోడల్‌ ధర రూ.4,300 వరకు పలికింది.

ఉద్యోగుల డేటా బదిలీలో జాప్యమా..

పట్టించుకోని పాలకులు

– బయ్యా శంకర్‌, అధ్యక్షుడు, ఏపీ ఎల్‌టీ అసోసియేషన్‌, బాపట్ల జిల్లా

– మల్లేశ్వరి,

స్టాఫ్‌ నర్సు, స్వర్ణ పీహెచ్‌సీ

– షేక్‌ అబ్దుల్‌ హఫీజ్‌, కాంట్రాక్టు ఉద్యోగి, చీరాల ప్రభుత్వ ఆసుపత్రి

7

Advertisement
 
Advertisement
Advertisement