బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Dec 2 2025 8:26 AM | Updated on Dec 2 2025 8:28 AM

మంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 పులిచింతల సమాచారం సాగర్‌ నీటిమట్టం పకడ్బందీగా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష నిర్వహణ కొండమూరులో 10 ఎకరాల దేవుని మాన్యం అన్యాక్రాంతం భూములు స్వాధీనం చేసుకునేందుకు యత్నం అధికారుల నిర్లక్ష్యం అధికారులదే పూర్తి బాధ్యత రోడ్ల మీద ధాన్యం.. రైతుల్లో దైన్యం

న్యూస్‌రీల్‌

పట్టించుకోని దేవదాయ శాఖ అధికారులు 2019లో హైకోర్టు తీర్పు ఇచ్చినా కదలని ఆక్రమణదారులు

మంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3000 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 42.1600 టీఎంసీలు.

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం సోమవారం 580.10 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 37,513 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ ఆదేశం

బాపట్ల: జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల పరీక్ష(ఎన్‌ఎంఎంఎస్‌)ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌ కుమార్‌ తెలిపారు.పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీక్షణ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడారు. పరీక్ష ఈనెల 7వ తేదీ ఆదివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారికి 12 వేల రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాలు అందజేస్తారని ఆయన పేర్కొన్నారు.

పరీక్షకు 2,412 మంది విద్యార్థులు

జిల్లాలోని బాపట్ల, చీరాల, రేపల్లె రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 11 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని, 2,412 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. పరీక్ష నిర్వహణకు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, చీఫ్‌ సూపరింటెండెంట్లు, రూట్‌ అధికారులు, కస్టోడియన్‌లను నియమించాలని చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా పరీక్ష కేంద్రాల్లో ఏఎన్‌ఎంలను నియమించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ బస్సులు నడపాలని చెప్పారు. కేంద్రాల్లో విద్యుత్‌ సరఫరాతో పాటు శుభ్రమైన తాగునీరు ఏర్పాటు చేయాలని తెలిపారు.పోలీసుల బందోబస్తుతో పాటు 144 సెక్షన్‌ అమలు చేయాలని తెలిపారు. సమీపంలో జిరాక్స్‌ సెంటర్లు మూసి వేయించాలని కలెక్టర్‌ చెప్పారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, అనుబంధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జే.పంగులూరు: కోట్లు విలువ చేసే దేవుని మాన్యం అన్యాక్రాంతం అవుతున్నా దేవదాయ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఆక్రమణదారులు సొంత భూములుగా కౌలుకు ఇచ్చి వాడుకుంటున్నారు. దీనికి అధికారులు వత్తాసు పలుకుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కొండమూరు గ్రామానికి చెందిన (ఖాతా నంబర్‌ 1504 ) రాజ్యలక్ష్మి అమ్మవారి పేరుతో 171–1, 3లో 1.36 ఎకరాల పొలం ఉంది. ఆదే గ్రామానికి చెందిన (ఖాతా నంబర్‌ 1505 ) మల్లేశ్వరస్వామివారి పేరు మీద 172–సీ 1, 3 పేరుతో 8.50 ఎకరాల పొలం ఉంది. ఇవి జాతీయ రహదారికి ఆనుకొని ఉండటంతో కొందరు ప్రైవేటు వ్యక్తులు రిజిస్టార్‌ డాక్యుమెంట్లు తీసుకువచ్చి ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు. 2011లో ఇది అక్రమం అని మార్టూరు సబ్‌ రిజిస్ట్రార్‌ రద్దు చేశారు. ప్రైవేటు వ్యక్తులు అనంతరం హైకోర్టును ఆశ్రయించారు. ఆస్తి ప్రైవేటు వ్యక్తులకు చెల్లదని, దేవుడికే చెందుతుందని 21 డిసెంబర్‌ 2019న తీర్పు ఇచ్చింది.

పట్టించుకోని అధికారులు

హైకోర్టు నుంచి తీర్పు వచ్చినా ఇప్పటి వరకు అధికారులు స్వాధీనం చేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ఆ భూముల్లో చిల్లచెట్లు మొలిచాయి. ఇటీవల మళ్లా కొందరు ప్రైవేటు వ్యక్తులు చిల్లచెట్లు తొలగించి, భూములు దున్నేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారుల్లో చలనం లేదు.

2011లో గ్రామస్తులు లోకాయుక్తలో ఫిర్యాదు

మాన్యం భూములు దేవాలయాల ఆవసరాలకే ఉండాలని, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండకూడదని గ్రామానికి చెందిన వాసుపల్లి సుబ్బారెడ్డి 2006లో లోకాయుక్తకు వెళ్లారు. ఈ కేసు ఆర్డీవో విచారణ చేయాలని 2011లో ఆదేశించింది. ఈ భూమిని వెంటనే స్వాధీనం చేసుకొని దేవాలయాలకు అప్పగించాలని 2019లో హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది.

అన్యాక్రాంత భూముల్లో ఇప్పటికే చిల్లచెట్లు తొలగింపు ఆపాం. లీగల్‌ ఓపీనియన్‌ తీసుకుంటున్నాం. వీలున్నంత వరకు అతికొద్ది కాలంలోనే దేవుని మాన్యం భూమిని స్వాధీనం చేసుకుంటాం.

– వాసు, ఎండోమెంట్‌ ఈవో

సంవత్సరాల పాటు కొండమూరు దేవుని మాన్యం భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. కాని ఎండోమెంట్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారి వల్లే భూములు అన్యాక్రాతం అవుతున్నాయి. కోర్టు స్వాధీనం చేసుకోమని ఉత్తర్వులు ఇచ్చినా ఆసక్తి చూపలేదు.

– నువ్వుల నాగేశ్వరరావు, కొండమూరు

2006లో నేను లోకాయుక్తాలో కేసు వేశా. అప్పుడే ఆర్డీవో విచారణ చేశారు. 2011లో మార్టూరు రిజిస్ట్రార్‌ కూడా భూములు దేవాలయానికి చెందినవే అని తేల్చారు. అనంతరం ప్రైవేటు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించగా దేవునివే అని ఉత్తర్వులు ఇచ్చింది. సంబంధిత అధికారులు వెంటనే భూములను స్వాధీనం చేసుకోవాలి.

–వాసుపల్లి సుబ్బారెడ్డి, కొండమూరు

చేలో ‘వరి’గిపోయింది

7

బాపట్ల1
1/10

బాపట్ల

బాపట్ల2
2/10

బాపట్ల

బాపట్ల3
3/10

బాపట్ల

బాపట్ల4
4/10

బాపట్ల

బాపట్ల5
5/10

బాపట్ల

బాపట్ల6
6/10

బాపట్ల

బాపట్ల7
7/10

బాపట్ల

బాపట్ల8
8/10

బాపట్ల

బాపట్ల9
9/10

బాపట్ల

బాపట్ల10
10/10

బాపట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement