అనారోగ్యంతో పోలీస్ జాగిలం రెమో మృతి
నగరంపాలెం: అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పోలీస్ జాగిలం (శునకం) రెమో ఆదివారం రాత్రి మృతిచెందింది. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) సమీపంలోని ఖాళీ ప్రదేశంలో రెమోకు పోలీస్ గౌరవ లాంఛనాలతో నివాళులర్పించి, అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా పోలీస్ విభాగానికి విశిష్ట సేవలందించిన రెమో మరణంపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సంతాపం వ్యక్తం చేశారు. రెమో జిల్లా భద్రతా విభాగంలో 2014 ఏప్రిల్ 29న విధుల్లో చేరి, సుమారు 12 ఏళ్లు క్రమశిక్షణ, నిబద్ధతతో సేవలు అందించినట్లు పలువురు కొనియాడారు. నివాళులర్పించిన వారిలో జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


