ముగిసిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ క్రికెట్ పోటీలు
గుంటూరు రూరల్: రాష్ట్రస్థాయి 69వ స్కూల్ గేమ్స్ అండర్–14 బాలుర క్రికెట్ పోటీలలో పశ్చిమగోదావరి జట్టు విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్‌లో కర్నూలు జట్టుపై విజయం సాధించింది. గత మూడురోజులుగా రూరల్ మండలంలోని దాసుపాలెం గ్రామం లోగల గ్రౌండ్‌లో జరుగుతున్న పోటీల్లో భాగంగా చివరిరోజు సోమవారం తొలుత జరిగిన సెమీ ఫైనల్స్‌లో గుంటూరుపై కర్నూలు విజయం సాధించింది. అదేవిధంగా అనంతపురంపై పశ్చిమగోదావరి విజయం సాధించింది. 3వ స్థానంలో గుంటూరు, 4వ స్థానంలో అనంతపురం జట్లు నిలిచాయి. అనంతరం జరిగిన ఫైనల్స్‌లో కర్నూల్‌ను పశ్చిమ గోదావరి ఓడించి విజేతగా నిలిచింది. స్కూల్ గేమ్స్ రాష్ట్రస్థాయి అబ్జర్వర్ బంగారు రాజు, దిలీప్‌చక్రవర్తిలు పర్యవేక్షించారు. విజేతగా నిలిచిన పశ్చిమగోదావరి జట్టును పెదకాకాని జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్‌ఎం కె.భాస్కరరావు అభినందించారు. ఉప్పలపాడు జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం మైనేనీ నాగేశ్వరావు, గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ సిహెచ్ గోపి, సుమేధ స్కూల్ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ త్రిమెన్ కమిటీ సెలక్టర్ సుధాకర్, ఏపీ పీఈటీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల కరిముల్లాచౌదరి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు యార్లగడ్డ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ దేశీయ ఆయుర్వేద సంఘం జనరల్ సెక్రెటరీ డాక్టర్ నామాల శ్రీనివాసరావు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ భూపాల్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.
అండర్ –14 బాలుర విభాగంలో విజేతగా నిలిచిన పశ్చిమ గోదావరి జిల్లా జట్టు


