రైతు సేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
నిజాంపట్నం: రైతు సేవా కేంద్రాలలో కల్పిస్తున్న సౌకర్యాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ చెప్పారు. స్థానిక రైతు సేవా కేంద్రాన్ని సోమవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతు తమ ధాన్యాన్ని రైతు సేవా కేంద్రంలో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలన్నారు. టార్పాలిన్ పట్టలు, ధాన్యం నింపుకునేందుకు గోనె సంచులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తేమ శాతం పరిశీలన చేయించుకుని అనంతరం ధాన్యంను విక్రయించాలని సూచించారు. ప్రస్తుతం దిత్వా తుపాను ప్రభావం బాపట్ల జిల్లాలో ఉందని వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు వచ్చాయన్నారు. ఇప్పటికే సాగుభూమిలో వరిపైరు కోతలు కోసి ఉంటే తమ ధాన్యాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కోతల ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలోని తుపాను షెల్టర్‌ను పరిశీలించారు. అదే విధంగా భారతీయ తీర రక్షణ దళం కార్యాలయాన్ని సందర్శించి కమాండెంట్ రాజేంద్ర స్వరూప్‌తో చర్చించారు. కార్యాలయంలో అందుబాటులో ఉన్న లైఫ్‌జాకెట్లను పరిశీలించి గజ ఈతగాళ్లతో మాట్లాడారు. ఆయన వెంట ఆర్డీఓ రామలక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్


