పురుగుమందు తాగి యువకుడు ఆత్మహత్య
చెరుకుపల్లి: కుటుంబ కలహాల కారణంగా ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం అర్థరాత్రి జరిగింది. మృతుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. చెరుకుపల్లికి చెందిన బొచ్చు నాగేశ్వరరావు, రాఘవల ఏకై క కుమారుడు అనంత నాగసాయి(32)కి ఏడాది కిందట వివాహం చేశారు. వివాహమైన కొద్ది కాలానికే భార్యా పుట్టింటికి వెళ్లిపోయింది. నాగసాయి హెదరాబాదులో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఐదు నెలల కిందట ప్రమాదం జరగగా అతడి కుడికాలు ఎడమ చేతిని సగ భాగం వరకు తొలగించారు. ఈ క్రమంలో మృతుడు కృత్రిమ కాలు అమర్చకుని జీవనం సాగిస్తున్నాడు. వివాహం జరిగి ఇంతకాలం జరుగుతున్న భార్యా కాపురానికి రాకపోవటంతో మనస్థాపం చెంది శనివారం అర్థరాత్రి తాను చనిపోవాలని నిర్ణయించుకొని తన తల్లిదండ్రులకు మెసేజ్ చేసి తాను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న పొలాలకు కొట్టే పురుగుమందు ప్యాకెట్లను నీటిలో కలుపుకుని తాగి ఆరుంబాక పంచాయతీ పరిధిలోని టపాసుల గోడౌన్ సమీపంలో జాతీయ రహదారి ప్రక్కన మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించి తల్లడిల్లిపోయారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు నమోదు చేసుకొని వృతుని తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాస్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


