పదిహేనేళ్ల తర్వాత తండ్రి చెంతకు కుమారుడు
అప్పట్లో విజయవాడ రైల్వేస్టేషన్‌లో తప్పిపోయిన రాము చిన్నప్పటి నుంచే మాటలు రాక ఇబ్బందులు చేరదీసి వెట్టిచాకిరి చేయించుకున్న బాతుల వ్యాపారి
గుడ్లూరు: 15 ఏళ్లుగా కనిపించని కుమారుడు దొరికితే ఆ సంతోషానికి అవధులు ఉండవు. ఈ ఘటన గుడ్లూరులో చోటుచేసుకుంది. వివరాలు... గుంటూరు జిల్లా రేపల్లె వద్ద లంక అనే గ్రామంలో వసంతరావు కుమారుడు రాముకు చిన్నప్పటి నుంచే మాటలు రావు. 15 ఏళ్ల క్రితం పని నిమిత్తం విజయవాడకు వెళ్లారు. రైల్వేస్టేషన్‌లో రాము తప్పిపోయాడు. అప్పుడు అతని వయసు 19 ఏళ్లు. ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో గుడ్లూరుకు చెందిన ఓ బాతుల వ్యాపారి చేరదీశాడు. కానీ వెట్టిచాకిరీ చేయించాడు. తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాలు తిప్పాడు. ఏడాదికి ఒకసారి మాత్రమే గుడ్లూరుకు తీసుకువచ్చేవాడు. మాటలు రాని రాము చదువుకోలేదు. గిరిజన కాలనీలో నివాసం ఉంటున్న సీపీఎం కార్యకర్త రామచంద్రయ్యతో రాముకు స్నేహం కుదిరింది. ఆధార్ కేంద్రంలో వేలిముద్రల ద్వారా అతని చిరునామా కనుక్కొన్నారు. ఎట్టకేలకు తండ్రి వసంతరావు, మామ శ్రీనివాసరావులకు విషయం తెలియజేశారు. శనివారం వారు గుడ్లూరుకు చేరుకున్నారు. 45 ఏళ్ల రామును తండ్రి, మామ భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే రామును తీసుకొని గ్రామానికి వెళ్లారు.
పదిహేనేళ్ల తర్వాత తండ్రి చెంతకు కుమారుడు


