ఎంఎల్‌సీ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి
గుంటూరు మెడికల్: జాతీయ హైవేల మీద యాక్సిడెంట్ బారిన పడిన వాళ్లకు జాతీయ హైవే అథారిటీ ద్వారా రూ.లక్షన్నర వరకు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. శనివారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జిల్లా వైద్యశాల, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు జెండర్ బేస్డ్ వెల్‌నెస్, మెడికో లీగల్ కేసులపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ నేషనల్ హైవేలపై ప్రమాదాలకు గురయ్యేవారు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా లబ్ధి పొందవచ్చని చెప్పారు. అడిషన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పి.మురళీకష్ణ మాట్లాడుతూ ఆడపిల్లలపై హింస నివారించవలసిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. మెడికో లీగల్ కేసుల విషయంలో వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హింసకులోనైన అనాధ చిన్నారులను, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని పునరావాస కేంద్రాలకు తరలించాలని వెల్లడించారు. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఇ.అన్నపూర్ణ, డాక్టర్ రోహిణి రత్నశ్రీ, డాక్టర్ సుజాత, డాక్టర్ ప్రియాంక, వెంకటేశ్వర్లు, ఇస్మాయిల్, వాణి పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి


