రాష్ట్ర స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థులు
వేటపాలెం: స్థానిక మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు క్రీడా పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ మహమ్మద్ నహిద శనివారం తెలిపారు. జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో కె. వినయ్‌కుమార్, చెస్ అండర్ –17 విభాగంలో సంపత్ కమార్, టీ జైకృష్ణ, ఎం. హేమంత్, అండర్ –14 విభాగంలో పి. దేవరాజు, పి అనిల్‌లు ఎంపికై నట్లు పేర్కొన్నారు. డిసెంబరు 7వ తేదీ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు, జనవరి 14న ఒంగోలులో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు జరగనున్నాయని తెలిపారు. విద్యార్థులను పీఈటీ కె. మమత, ఉపాధ్యాయులు అభినందించారు.


