ధాన్యమంతా కొనుగోలు | - | Sakshi
Sakshi News home page

ధాన్యమంతా కొనుగోలు

Nov 29 2025 7:43 AM | Updated on Nov 29 2025 7:43 AM

ధాన్య

ధాన్యమంతా కొనుగోలు

శనివారం శ్రీ 29 శ్రీ నవంబర్‌ శ్రీ 2025 ధాన్యమంతా కొనుగోలు పరీక్షలు విద్యార్థులకా... వర్సిటీకా..!

న్యూస్‌రీల్‌

మండలాల మార్పు

పులిచింతల సమాచారం

సాగర్‌ నీటిమట్టం

వీవీ ప్యాట్స్‌ తనిఖీ

బాపట్ల
శనివారం శ్రీ 29 శ్రీ నవంబర్‌ శ్రీ 2025
పేదలకు అన్యాయం
పోలింగ్‌ బూత్‌ ఏజెంట్ల వివరాలివ్వండి

రైతుల సమస్యలపై వెంటనే

అధికారులు స్పందించాలి

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌

వి.వినోద్‌ కుమార్‌

వర్షసూచన నేపథ్యంలో

అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

గోవాడ రైతు సేవ కేంద్రంలో

ధాన్యం కొనుగోలు పరిశీలన

పూడివాడలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో డాక్టర్‌ ఈవూరి గణేష్‌, పార్టీ నేతలు

వేమూరు (అమర్తలూరు)/చెరుకుపల్లి: రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ భరోసా ఇచ్చారు. అమర్తలూరు మండలంలోని గోవాడ రైతు సేవ కేంద్రాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ధాన్యం సేకరణలో భాగంగా ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియపై ఆరా తీశారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. అన్నదాతలు కచ్చితంగా తేమ శాతం నిర్దేశిత స్థాయిలో ఉండేలా ధాన్యం ఆరబెట్టి తీసుకురావాలని సూచించారు. రైతు సేవ కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి విక్రయించడం ద్వారా మద్దతు ధర పొందాలని కోరారు. ధాన్యం కొన్న వెంటనే గంటల వ్యవధిలోనే రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ మొత్తం జమ అవుతుందని వివరించారు. ఈ నెల 29, 30 తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రైస్‌ మిల్లులను రైతు సేవ కేంద్రాలకు అనుసంధానించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దారు నెహ్రూబాబు, ఎంపీడీవో మారుతి శేషాంబ, మండల వ్యవసాయాధికారి ఎం.హేమంత్‌ భరత్‌ కుమార్‌, రైతులు పాల్గొన్నారు.

అధికారులతో సమీక్ష

చెరుకుపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మద్దతు ధర లభించేలా రైతులకు అండగా ఉండాలని కోరారు. ధాన్యం ఆరబెట్టుకునేందుకు ఇప్పటికే వెయ్యి టార్పాలిన్‌ పట్టలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అవసరమైతే మరో వెయ్యి పట్టలు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్‌ 5న జరగనున్న మెగా పేరెంట్స్‌ మీటింగ్‌ను ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అధికారులు చర్చించుకుని ఒక ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చెయ్యాలని పేర్కొన్నారు. ఇందుకు ప్రతి అధికారి భాగస్వామి కావాలని కలెక్టర్‌ ఆదేశించారు. తహసీల్దార్‌ సీహెచ్‌ పద్మావతి, ఎంపీడీవో షేక్‌మహబూబ్‌ సుభాని, మండల విద్యాశాఖ అధికారి టి. నవీన్‌కుమార్‌, మండల వ్యవసాయ అధికారి ఎండీ ఫరూఖ్‌, తదితరులు పాల్గొన్నారు.

ప్రజల ఇబ్బందులను

తక్షణమే పరిష్కరించాలి

బాపట్ల టౌన్‌: ప్రజల ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భావన విశిష్ట తెలిపారు. ఎస్టీలు, విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగింది. బాధితులతో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా జాయింట్‌ కలెక్టర్‌ తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. వీరిని రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. పీజీఆర్‌ఎస్‌లో నమోదైన ప్రతి అర్జీని తక్షణమే పరిష్కరించాలన్నారు. డిసెంబర్‌ ఒకటో తేదీన పింఛన్‌ నగదు పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ముందుగానే బ్యాంకుల నుంచి నగదు తీసుకొచ్చి సంబంధిత సిబ్బందికి అందించాలని సూచించారు.

7

వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో

బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలు విడిపోతున్నాయని డీఆర్‌ఓ జి.గంగాధర్‌ గౌడ్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన గజిట్‌ నోటిఫికేషన్‌ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచాలన్నారు. ప్రభుత్వ ప్రకటనలు ప్రజలందరికీ తెలిసేలా అవగాహన కల్పించాలన్నారు. అలాగే ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పార్టీల ప్రతినిధులకు ఆర్డీఓ సూచన

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2900 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 2000 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 42.1600 టీఎంసీలు.

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశ య నీటిమట్టం శుక్రవారం 581.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 48,929 క్యూసెక్కుల వచ్చి చేరుతోంది.

ఫిరంగిపురం: రేపూడి వ్యవసాయ మార్కెట్‌లో భద్రపరిచిన ఈవీఎం, వీవీ ప్యాట్స్‌ను ఆర్‌డీవో శ్రీనివాసరావు శుక్రవారం తనిఖీ చేశారు.

ధాన్యమంతా కొనుగోలు 1
1/8

ధాన్యమంతా కొనుగోలు

ధాన్యమంతా కొనుగోలు 2
2/8

ధాన్యమంతా కొనుగోలు

ధాన్యమంతా కొనుగోలు 3
3/8

ధాన్యమంతా కొనుగోలు

ధాన్యమంతా కొనుగోలు 4
4/8

ధాన్యమంతా కొనుగోలు

ధాన్యమంతా కొనుగోలు 5
5/8

ధాన్యమంతా కొనుగోలు

ధాన్యమంతా కొనుగోలు 6
6/8

ధాన్యమంతా కొనుగోలు

ధాన్యమంతా కొనుగోలు 7
7/8

ధాన్యమంతా కొనుగోలు

ధాన్యమంతా కొనుగోలు 8
8/8

ధాన్యమంతా కొనుగోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement