భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్ వస్త్ర తయారీ విధానాలు తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాకు చెందిన 50 మంది చేనేత కార్మికులు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిని సందర్శించారు. చేనేత సహకార సంఘం, కళా పునర్వీ హ్యాండ్లూమ్ యూనిట్ సందర్శించి మగ్గాలపై తయారవుతున్న వస్త్రాలు, టై అండ్ డై ఇక్కత్ డిజైన్లు, మార్కెటింగ్ వంటివి అడిగి తెలుసుకున్నారు. క్షేత్రపరిశీలనలో భాగంగా పోచంపల్లిని సందర్శించినట్లు బాపట్ల జిల్లా జౌళి శాఖ ఏడీ వెంకట్రావు, క్లస్టర్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ వెంకటేశ్వర్‌రావు తెలిపారు.
చేనేత వస్త్రాలను పరిశీలిస్తున్న కార్మికులు
మగ్గాలను పరిశీలిస్తున్న చేనేత కార్మికులు
పోచంపల్లిని సందర్శించిన బాపట్ల చేనేత కార్మికులు


