జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు ఐదుగురు ఎంపిక
తూములూరు(కొల్లిపర): ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల నున్నలో అండర్– 19, 14 విభాగాల్లో రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. తూములూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు ప్రధానోపాధ్యాయురాలు కె.నాగలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థ్ధులను పాఠశాలలో పీడీ ఎస్.సాంబశివరావు, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు అభినందించారు.


